ఛాంపియన్స్ ట్రోఫీ: నేడు పోరులో ఓడితే ఇంటికే..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు ఆసక్తికర పోరు సాగనుంది. గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉండటంతో ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరగనుంది. గ్రూపు-Bలోని ఆసీస్, సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్లలో గెలవగా, నిన్నటి మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయి 3 పాయింట్లతో సమంగా ఉన్నాయి.
మరోవైపు ఇంగ్లండ్, అఫ్గాన్ ఓటమితో లీగ్ ప్రారంభించాయి. దీంతో నేడు గెలిచిన జట్టు రెండు పాయింట్లతో సెమీస్ రేసులో నిలుస్తుంది. ఓడితే ఇంటిబాట పట్టాల్సి వస్తుంది. దీంతో నేటి మ్యాచ్ పై ప్రేక్షకుల్లో ఎవరు సెమిస్ కు వెళతారు, ఎవరు ఇంటికి వెళతారు అన్న ఆసక్తి నెలకొంది.