Breaking: న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. విలియమ్సన్ 81 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా న్యూజిలాండ్ కు ఫలితం దక్కలేదు. యంగ్ 22, రచిన్ 6, మిచెల్ 17, టామ్ 14, ఫిలిప్స్ 12, బ్రేస్వెల్ 2 పరుగులు చేశారు.
కట్టుదిట్టమైన బౌలింగ్ తో జడేజా, వరుణ్, కుల్దీప్, అక్షర్ అదరగొట్టారు. గ్రూప్ స్టేజీలో 3 మ్యాచ్లలోనూ గెలిచి 6 పాయింట్లతో ఇండియా టాపర్ గా నిలిచింది. సెమీస్లో AUSతో భారత్, సౌత్ ఆఫ్రికాతో కివీస్ తలపడనున్నాయి.