ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్లోకి భారత్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులు చేసింది.
భారత్ 265 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ (84), అయ్యర్ (45), రాహుల్ (42) రాణించడంతో 48.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. చివర్లో రాహుల్, పాండ్య టీమ్ ఇండియాను గెలిపించారు. రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ ఫైనల్ ఆడనుంది.