రోహిత్ శర్మ కీలక నిర్ణయం..!
టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడేందుకు ఫిట్నెస్, ఫోకస్ పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో కలిసి ఆయన పని చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అభిషేక్ నుంచి బ్యాటింగ్, ఫిట్నెస్ టిప్స్ తీసుకుంటారని సమాచారం. కాగా ఐపియల్ లో దినేశ్ కార్తీక్ కు అభిషేక్ మెంటార్ గా ఉన్నారు. ఆ సమయంలో దినేష్ కార్తీక్ చెలరేగి ఆడిన విషయం తెలిసిందే.