ఛాంపియన్స్ ట్రోఫీలో బోణి కొట్టిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో గిల్ సూపర్ సెంచరీ (101)తో అదరగొట్టడంతో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
229 పరుగుల లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ 41 పరుగులతో, కేఎల్ రాహుల్ 41 పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ 2, టస్కిన్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు. ఇండియా నెక్స్ట్ మ్యాచ్ ఆదివారం పాకిస్తాన్ తో ఆడనుంది. దుబాయ్ ఇందుకు వేదిక కానుంది.