రోహిత్, కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్. టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజాలు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ టూర్లోని తొలి టెస్టుకు రావాలని BCCI ఆహ్వానించనున్నట్లు సమాచారం. జూన్ 20న లీడ్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కి ముందు కోహ్లి, రోహిత్ కు 'గార్డ్ ఆఫ్ హానర్' ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
దాంతో పాటు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ ప్రకటించినా A ప్లస్ గ్రేడులోనే కొనసాగిస్తామని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికీ వీరిద్దరూ భారత క్రికెట్ లో భాగమేనని ఏ ప్లస్ గ్రేడ్ సౌకర్యాలని కల్పిస్తామని పేర్కొంది. సాధారణంగా ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్టు ఆటగాళ్లు సంవత్సరానికి రూ.7కోట్ల ప్యాకేజీని పొందుతారు.