BREAKING NEWS: ప్రముఖ భారత క్రికెటర్ కన్నుమూత

Sports Published On : Wednesday, March 12, 2025 10:19 PM

హైదరాబాదుకు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) అమెరికాలో కన్నుమూశారు. 1967-1975 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అబిడ్ అలి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్, మీడియం పేసర్. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో సభ్యుడు. తన కెరీర్లో 29 టెస్టు మ్యాచులు ఆడి ఆయన 47 వికెట్లు పడగొట్టారు. 1959-79లో హైదరాబాద్ రంజీ జట్టు, ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికై పటౌడీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా మీద తొలి టెస్ట్ ఆడారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...