కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా అవుట్
టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కెప్టెన్ ఎవరైనా ఆసక్తి నెలకొంది. అయితే ఇంతకుముందు తర్వాత కెప్టెన్ గా బుమ్రా పేరు ఎక్కువగా వినిపించేది. కానీ ప్రస్తుతం బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి తానే స్వయంగా తప్పుకున్నట్లు సమాచారం. ఇటీవల వెన్నెముక గాయం నుంచి కోలుకున్న బుమ్రా పూర్తి సిరీస్ ఆడే అవకాశం లేదు. ఈ పరిస్థితిలో బుమ్రా కెప్టెన్ బాధ్యతలు వహించలేడు.