ఐపీఎల్: రీ ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా
ఐపీఎల్-2025 ప్రారంభంలో ముంబై ఆడే కొన్ని మ్యాచులకు ఆ టీం ప్లేయర్ బుమ్రా దూరం కానున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ తొలి వారంలో ఆయన తిరిగి జట్టులో చేరతారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వెన్ను గాయంతో బాధపడుతున్న ఆయన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి కూడా తెలిసిందే.
కాగా ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచును మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఆ తర్వాత 29న గుజరాత్ టైటాన్స్, 31న కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.