ఐపీఎల్ నుంచి మరో బిగ్ అప్డేట్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటులోలేని వారి స్థానంలో కొత్తవారిని జట్టులోకి తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ రీప్లేస్మెంట్లు తాత్కాలికమేనని స్పష్టం చేసింది.