సచిన్ కు మరో అరుదైన గౌరవం
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ మరో అరుదైన గౌరవం అందించింది. ముంబైలోని BCCI ప్రధాన కార్యాలయంలోని ఒక గదికి 'SRT 100' గా నామకరణం చేసింది. క్రికెట్ కి సచిన్ చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవం కల్పించినట్లు BCCI ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచిన్ తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ పాల్గొన్నారు.