పోసానికి అండగా వైసిపి శ్రేణులు
వైసిపి మద్దతుదారు, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని బుధవారం రాత్రి ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వైసిపి శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అంటూ కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.