వైఎస్ జగన్ కీలక నిర్ణయం: కూటమి ప్రభుత్వానికి ఇక చుక్కలే

Politics Published On : Tuesday, January 21, 2025 10:00 PM

అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తానని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఈ నెలఖారు వరకు ఆయన లండన్లోనే ఉంటారని సమాచారం. జగన్ విదేశీ టూర్ ముగించుకుని రాష్ట్రానికి చేరుకోగానే జిల్లాల పర్యటనకు సంబంధించిన ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలఖారుకు ఆయన ఏపీకి వచ్చే అవకాశాలు ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.