గవర్నరుగా విజయ్ సాయిరెడ్డి.. జగన్ భారీ స్కెచ్: పథకం ప్రకారమే రాజీనామా?

Politics Published On : Friday, March 7, 2025 03:43 PM

వైసిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఉపరాష్ట్రపతి అధికారిక కార్యక్రమంలో కనపడటం చూసి అందరూ షాక్ అయ్యారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరమైన తర్వాత బిజెపిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

ఇప్పుడు తమిళనాడు గవర్నర్ గా వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశీర్వాదం కూడా ఆయనపై గట్టిగానే ఉన్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన సన్నిహితంగా ఉంటారు. వైసిపి 2019లో అధికారంలోకి రావడానికి ఇదే ప్రధాన కారణం అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. రాజకీయంగా కూడా దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న విజయసాయిరెడ్డి లాబీయింగ్ మొదలుపెట్టి గవర్నర్ అయ్యేందుకు అన్ని మార్గాలను సుగుమం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో కచ్చితంగా విజయసాయిరెడ్డి ఆ పదవిలో ఉండే అవకాశం ఉందని సమాచారం. రాజ్యసభ ఎంపీగా ఉన్నా సరే తనకు ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మూడున్నరేళ్లు పదవి ఉండగానే ఆయన వదులుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న విజయ్ సాయి రెడ్డికి ఉన్న పరిచయాలతో ఆయన కచ్చితంగా ఏదో ఒక కీలక పదవిలో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. గతంలో కూడా ఆయన గవర్నర్ పదవి కోసం ప్రయత్నాలు గట్టిగానే చేసారు. వాటిని నిజం చేస్తూ విజయసాయిరెడ్డి గవర్నర్ గా రాజభవన్ లో అడుగుపెట్టేందుకు బ్యాక్ గ్రౌండ్ లో గట్టిగానే వర్క్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతవరకు స్వాగతిస్తుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...