వాళ్ళందరినీ కూడా బయటకు పంపండి : విజయ్ సాయి రెడ్డి
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరో సంచలన ట్వీట్ చేశారు. వాళ్లను కూడా బయటకు పంపండి అంటూ ట్వీట్ చేశారు. దేశ భద్రత గురించి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులు భద్రతకు పెద్ద ముప్పుగా మారడమే కాకుండా సామాజిక స్వరూపాన్ని కూడా దెబ్బతీస్తున్నారని తెలిపారు.
చాలా మంది వ్యక్తులు మారిన పేర్లతో జీవిస్తున్నారని, కొందరు నేరాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని. ఈ పరిస్థితి దేశ శాంతి భద్రతలకు పెను సవాలు అని తెలిపారు. అక్రమ వలసదారులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా వారి దేశానికి తిరిగి పంపించేందుకు ప్రచారాన్ని ప్రారంభించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని ట్వీట్ చేశారు. దేశప్రజల భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడకూడదని కోరారు.