ప్రధాని ఆరోగ్యం అత్యంత విషమం: కొత్త ప్రధాని ఎంపిక..!

Politics Published On : Tuesday, April 7, 2020 08:00 AM

కరోనా వైరస్ బారిన పడిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మరింత విషమించింది. ఒక్కరోజు వ్యవధిలో ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది అని డాక్టర్లు వెళ్లడించారు. ఆసుపత్రిలో చేరిన 24 గంటల వ్యవధిలో బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మరోవంక- బ్రిటన్‌లో అధికార మార్పిడి జరిగిపోయింది. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా డొమినిక్ రాబ్‌ను నియమించారు. బోరిస్ జాన్సన్ ఆరోగ్యం కుదుటపడేంత వరకూ డొమినిక్ రాబ్ ప్రధానిగా బాధ్యతలను నిర్వహించనున్నారు.

10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నా ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం తో పటు దగ్గు, జలుబు, జ్వరం తీవ్రతరం కావడం వల్ల ఆయనను లండన్‌లోని ప్రఖ్యాత సెయింట్ థామస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో ఆదివారం సాయంత్రం ఐసీయూలో చేర్చారు.ఆయన త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐసీయూలో ఆయనకు అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నారని చెప్పారు. పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతారని అన్నారు.