నేడు ఢిల్లీ సీఎం ప్రకటన.. వీడనున్న సస్పెన్స్
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్సుకు నేడు తెరపడే అవకాశం ఉంది. నేడు దేశ రాజధానిలో జరిగే సమావేశంలో సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఆ పేరుపై హైకమాండ్ ఇప్పటికే స్పష్టతతో ఉన్నప్పటికీ బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది.
కేజీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, జితేంద్ర మహాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ అధికారిక ప్రకటన తరువాత ఢిల్లీ బాస్ ఎవరో తేలిపోనుంది.