విజయసాయి రెడ్డి మంచోడు : రఘురామరాజు
వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు స్పందించారు. ఎప్పుడు ఉప్పు-నిప్పులా ఉండే తమ మధ్య ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా విజయసాయిరెడ్డిని విభేదించినానని, వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి మంచి వ్యక్తంటూ ప్రశంసించారు. వైసీపీ కోసం విజయసాయిరెడ్డి తన ఇల్లు, కార్యాలయాన్ని అమ్ముకున్నాడన్నారు.
విజయసాయిరెడ్డితో రాజకీయంగా తాను విభేదించానని, ఆయనతో తనకు వ్యక్తిగత కక్షలేమీ లేవని తెలిపారు. ఏ రకంగా చూసినా సాయిరెడ్డి చెడు వ్యక్తి కాదన్నారు. రఘురామ వైసీపీ ఎంపీగా ఉండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే.