జనసేన 11 ఏళ్ల ప్రయాణం వాళ్ళ 11కు అంకితం: పవన్ కళ్యాణ్
జనసేన 11 ఏళ్ల ప్రయాణం వాళ్ళ 11కు అంకితం అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా చిత్రాడలో జరిగిన జయకేతనం సభలో ఆయన మాట్లాడుతూ ఖుషి సినిమా చూసి గద్దర్ తనను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రోత్సహించారన్నారు.
చంటి సినిమాలో మీనాలా తనను ఇంట్లో చాలా జాగ్రత్తగా పెంచారని తెలిపారు. "మా నాన్న నన్ను ఎస్సై అవ్వమన్నారు. కానీ నాకు డిగ్రీ రాలేదు. నేనెప్పుడూ కోట్లు సంపాదించాలని ఆలోచించలేదు. సగటు మనిషిగా బతకడమే నా కోరిక. చిన్నతనం నుంచీ నన్ను అత్యంత జాగ్రత్తగా పెంచుకొచ్చారు. అలాంటి నన్ను పార్టీ పెట్టేలా చేసింది, ప్రజాసమస్యలపై పోరాడేలా చేసింది నాలోని భావతీవ్రతే'" అని చెప్పుకొచ్చారు. సెకండ్ షో సినిమాకు వెళ్లి తన తండ్రి చేతిలో తిట్లు తిన్న తాను కోట్ల మందికి సంబంధించిన రాజకీయాలు చేయడం భగవంతుడి రాతేనని అన్నారు.