కిరణ్ రాయల్ పై ఆరోపణలు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ పై పలు లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దానిపై జనసేన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ తరుపున విచారణకు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
కొద్దిరోజులుగా జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేస్తోంది. కిరణ్ రాయల్ శారీరకంగా వాడుకొని తనను మోసం చేశాడని, కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేసి మోసగించాడని లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తోంది. అంతేగాక కిరణ్ రాయల్ తనని ఫోన్ లో బెదిరించిన ఆడియోలు విడుదల చేసి, ఆత్మహత్య చేసుకుంటానని ఆ మహిళ వీడియో సందేశం విడుదల చేసింది.