చంద్రబాబుకు అందుకే మద్దతిచ్చా: పవన్ కళ్యాణ్
చంద్రబాబుకు మద్దతు ఇవ్వడంపై పీ-4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే తాను చంద్రబాబుకు మద్దతిచ్చానని చెప్పారు. సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడని, చంద్రబాబు లాంటి విజనరీ నేత వచ్చే తరం గురించి ఆలోచిస్తారని తెలిపారు. పీ-4 కార్యక్రమం వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయని అన్నారు. తెలుగు ప్రజలు బాగుండాలనేదే చంద్రబాబు, తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.