శరత్ పవార్ ప్లాన్ కి బిత్తర పోయిన బీజేపీ.

Politics Published On : Wednesday, November 27, 2019 12:35 PM

బిజెపికి వారం రోజుల సమయం ఇచ్చి, ప్రతిపక్షాలకు 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా చివరికి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసాడు మహారాష్ట్ర గవర్నర్. అదో అద్భుతమైన చాణక్య నిర్వాకంగా భాజపాల భజంత్రీలు మారుమోగాయి. సాదారణంగా ఒకసారి రాష్ట్రపతి పాలన వస్తే, మళ్ళీ ఎన్నికలు తప్ప గత్యంతరం ఉండదు.

రాజకీయ కురువృద్ధుడు శరద్‌పవార్‌కు ఇదేమీ సమస్యగా అనిపించలేదు. శివసేనకు మద్దతు గురించి నానుస్తున్నట్లు నటించాడు. ఇచ్చే అవకాశం లేనట్లు ఫీలర్స్ వదిలాడు. ముందు రాష్ట్రపతిపాలన ఎలా ఎత్తివేయించాలి అని ఆలోచించాడు. అజిత్‌పవార్‌ను పావుగా కదిపి, భాజపాలకు ఎర వేసాడు.

బోల్తాపడ్డ భాజపాలు రాత్రికిరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసారు. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ ఉప ముఖ్యమంత్రిగా హడావుడిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. నరేంద్రమోదీ, అమిత్షాలు 'హుందా'గా ట్వీట్లు వేసి పండగ చేసుకున్నారు. మళ్ళీ భజంత్రీలు జేజేలు పలికారు.

ఈ లోపలే పవార్, బోనస్‌గా అజిత్‌పై ఉన్న కేసులు మాఫీ చేయించాడు. 'కిడ్నాప్' కాబడ్డ ఎమ్మెల్యేలను తిరిగి రప్పించాడు. బలనిరూపణకు సిద్ధం అయ్యాడు. ఓవరాల్‌గా భాజపాలని నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టాడు.