ఎమ్మెల్సీగా నాగబాబు..?
ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి త్వరలో నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఐదు ఖాళీలు ఉండగా వాటిలో ఒకటి జనసేన తరపున నాగబాబుకు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు కూడా నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకుంటామని ప్రకటించారు.