హిమాలయాలకు పవన్.. వద్దని వారించిన మోడీ
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ స్టేజీపైనే ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ తో మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోదీ తనతో ఏం మాట్లాడారని మీడియా ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. "ప్రధాని నాతో చిన్న జోక్ చేశారు. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగారు. అందుకు ఇంకా చాలా టైమ్ ఉందని, నువ్వు చేయాల్సిన పని చెయ్యి" అని చెప్పారని పవన్ తెలిపారు.