పిఠాపురం వర్మకు నాగబాబు సీరియస్ వార్నింగ్
జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురం వర్మకి ఎమ్మెల్సీ నాగబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో పవన్ విజయానికి రెండు ఫ్యాక్టర్స్ పనిచేశాయని, అవి పవన్, పిఠాపురం ప్రజలు అని తెలిపారు.
పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ..అంతకంటే ఏమీ చేయలేం అని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మను ఉద్దేశించే అన్నవని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.