బాలయ్యా మజాకా.. టీడీపీకే మున్సిపల్ చైర్మన్ పదవి
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో వైసీపీ, టీడీపీల మధ్య వార్ నడిచింది. మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. హిందూపురం ఎమ్మెల్యే మంత్రం ఫలించింది. చివరకు మున్సిపల్ చైర్మన్‌గా కౌన్సిలర్ డీవీ రమేశ్ ఎన్నికయ్యారు.
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీతో విసుగు చెందిన కౌన్సిలర్లు టీడీపీలో చేరారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. "పద్మభూషణ్ అవార్డు రావడం నాలో కసి పెంచింది.నాకెవరూ చాలెంజ్ కాదు..నాకు నేనే చాలెంజ్" అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.