రెడ్ బుక్ పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు
రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికి వెళ్లినా తనను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారని, రెడ్ బుక్ తన పని అది చేసుకుంటూ వెళ్తుందని తెలిపారు. టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవ్వరినీ వదలబోమని హెచ్చరించారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టనని గతంలోనే తాను చెప్పినట్లు గుర్తు చేశారు. ఎవరినైనా వదిలిపెడతాననే డౌట్ అక్కర్లేదన్నారు. దేశంలోనే ఏ పార్టీకి లేని బలం టీడీపీకి ఉందని, కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పారు.