పవన్ కళ్యాణ్ పై జనసేన నేతల తీవ్ర అసంతృప్తి
అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉండాలని, చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పవన్ పై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
పవన్ సీఎం కావాలని తాము కోరుకుంటుంటే 10 ఏళ్లు, 15 ఏళ్లు బాబునే సీఎంగా చూడాలని అనడం ఏంటంటూ లోలోపల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు.