అధికారంలో లేకున్నా మాట నిలబెట్టుకున్న జగన్
అధికారంలో లేకపోయినా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో మార్చి 22 వ తేదీన కురిసిన అకాల వర్షాలు, వడగండ్లకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. లింగాల మండలంలోని నష్టపోయిన అరటి రైతులను వైఎస్ జగన్ పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే 670 మంది రైతులకు హెక్టారుకు రూ.20 వేల చొప్పున రూ.1.14 కోట్ల ఆర్థిక సాయం మాజీ సీఎం వైఎస్ జగన్ అందించారు.
ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అధికారంలో లేకపోయినా అన్నదాతలకు ఇచ్చిన మాటని వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని వైసీపీ పేర్కొంది. ఈ క్రమంలో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది.