సకల శాఖా మంత్రి లోకేష్: మాజీ మంత్రి

Politics Published On : Friday, March 14, 2025 08:42 PM

ఏపీ మంత్రి నారా లోకేశ్ సకల శాఖా మంత్రిగా పనిచేస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. విద్యాశాఖను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పుస్తకాలపై జగన్ ఫొటోలు ఉన్నాయని ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలపై చంద్రబాబు బొమ్మలు లోకేశ్ కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు.

పాఠశాల విద్యను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని చెప్పారు. వైసీపీ హయాంలో ఉన్నత విద్యను నాణ్యతతో అందించామని తెలిపారు. యూనివర్సిటీల వీసీలను భయపెట్టి రిజైన్ చేయించారని, విద్యా వ్యవస్థను నడిపించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. వర్సిటీల్లో నిబంధనలకు నీళ్లు వదిలారని విమర్శించారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...