చంద్రబాబు ఆ పాత్ర వేస్తే బాగుండేది: అంబటి
కూటమి నేతలపై, సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో పస లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే వైసిపి ఎమ్మెల్యేలు సభకు వెళ్లలేదని తెలిపారు.
కూటమి నేతలను పొగుడుకునేందుకే సభా సమయం సరిపోయిందని ఎద్దేవా చేశారు. స్కిట్స్ లోనూ జగన్ పేరు మర్చిపోలేకపోయారని, చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేదని సెటైర్లు విసిరారు. వైఎస్ఆర్ స్నేహితుడినని చెప్పుకునే ఆయన ఇప్పుడు వైఎస్సార్ జిల్లా పేరు మార్చారని మండిపడ్డారు.