కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీ..?

Politics Published On : Wednesday, May 14, 2025 08:59 PM

బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ లో కవిత ఒంటరి అయ్యారని, తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కవితకు కల్వకంట్ల ఇంటితోనే పోరు మొదలైందని, కవిత కొత్త పార్టీని కాంగ్రెస్ స్వాగతిస్తుందని తెలిపారు.