పొత్తులో కీలక మలుపు, సీఎం జగన్ ఆపరేషన్ ఢిల్లీ.

Politics Published On : Friday, May 26, 2023 08:08 PM

ఏపీ సీఎం జగన్ రూటు మార్చారు. చంద్రబాబు, పవన్ స్కెచ్ కు కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీని కలుపుకుని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో జాతీయ స్థాయిలో జగన్ చర్చకు కారణమయ్యారు. ఓపెన్ గా ప్రధాని మోదీ కి మద్దతుగా నిలుస్తున్నారు. అటు కేంద్రం నుంచి జగన్ సర్కార్ కు అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి, పొత్తు చర్చల వేళ జగన్ ఆపరేషన్ ఢిల్లీ మొదలు పెట్టారు.

ఢిల్లీ వేదికగా సీఎం జగన్: ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలతో ముందుకె వెళ్తున్నారు. అధికారం నిలబెట్టుకొనేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలింది. బీజేపీతో పొత్తు దిశగా ఆ రెండు పార్టీల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు సానుకూల సంకేతాలు రాలేదు. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా ఎన్నిక ల ఏడాదిలో కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వానికి అనుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆర్దికంగా తోడ్పాటు ఇచ్చేలా నిర్ణయాలు జరగుతున్నాయి. ఈ సమయంలోనే కేంద్రానికి మద్దతుగా జగన్ నిలుస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకమైన సమయంలో మద్దతు ప్రకటించారు. ప్రధానికి మద్దతుగా ముఖ్యమంత్రి: ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించిన సమయంలో స్వయంగా హాజరైన ప్రధాని మోదీకి బాసటగా నిలవాలని నిర్ణయించారు. టీడీపీ కూడా పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించింది .రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర పార్టీ నుంచి హాజరు కానున్నారు. సీఎం స్వయంగా వస్తుండటం తో ప్రాధాన్యత పెరిగింది. టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీని ఒప్పిస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేసారు. దీని ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి జగన్ కు ఏ మాత్రం అండదండలు లేకుండా చూడాలనే చంద్రబాబు, పవన్ వ్యూహం. కానీ, వారి అంచనాలకు భిన్నంగా కొద్ది రోజులుగా గతం కంటే జగన్ ను అనుకూలంగా కేంద్రం నుంచి నిర్ణయాలు వెలువడుతున్నాయి. దీని ద్వారా పొత్తు పై బీజేపీ తమ అభిప్రాయం చెప్పకనే చెబుతోందా అనే చర్చ మొదలైంది.