కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు భారీ శుభవార్త ప్రకటించిన కేంద్రం..!

Politics Published On : Monday, March 30, 2020 09:22 AM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రమౌతున్న నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికుల దినసరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి నాన్‌ రిఫండబుల్‌ సొమ్ము కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ సంబంధిత నిబంధనలను సడలించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనకు అనుగుణంగా కార్మికశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మూడు నెలల వేతనం, డీఏ లేదా పీఎఫ్‌ ఖాతాలో మొత్తం సొమ్ములో 75 శాతానికి మించకుండా సభ్యులు విత్‌డ్రా చేసుకోవచ్చునని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అవసరం అయిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విత్‌డ్రాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ముందుగా ప్రాసెస్‌ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఫీల్డ్‌ ఆఫీసర్లకు ఈపీఎఫ్‌ఓ ఆదేశాలు కూడా జారీ చేసింది.