బీజేపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జెట్లీ ఇకలేరు..!
ఎయిమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తుదిస్వసా విడిచారు. అనారోగ్య కారణాలతో ఎయిమ్స్‌లో చేరినప్పటి నుంచీ ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఆయన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఐతే తాజాగా ఆయన మరణ వార్త గురించి తెలియడం తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్పత్రికి వెళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా శుక్రవారం ఆసుపత్రికి వెళ్లారు. జైట్లీ కుటుంబ సభ్యులని పరామర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ జైట్లీ మృతి పట్ల విచారం వ్యక్తం చేసారు. అనారోగ్యం వల్ల ఏ మంత్రి పదవి చేపట్టకపోయినా అరుణ్ జైట్లీ సేవలు బీజేపీకి చాలా అవసరం. వృత్తి రీత్యా లాయరైన జైట్లీ మోదీ మొదటి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు.
ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు మాత్రం అరుణ్ జైట్లీకి సంబంధించి ఏ హెల్త్ బులిటెనూ జారీ చెయ్యలేదు. ఇప్పటివరకూ అమిత్ షా, హర్ష వర్ధన్, రామ్ నాథ్ కోవింద్తోపాటూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితరులు ఎయిమ్స్‌కి వెళ్లి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
కొంతకాలంగా జైట్లీ కాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు కూడా. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఏడాది మేలో కూడా అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. అనారోగ్యం వల్లే ఆయన 2019 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. డయాబెటిస్తో బాధపడుతున్న జైట్లీ 2014 సెప్టెంబర్‌లో బరువు తగ్గించుకునేందుకు బారియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు.ఏది ఏమైనా జైట్లీ మృతి bjp పార్టీకి తీరని లోటు.