జగన్‌కి కేంద్రం బంపరాఫర్, కేసీఆర్‌ను కాదని కీలక పదవి ..
ఏపీ సీఎం జగన్ తో స్నేహ సంబంధాలను కొనసాగించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ తో ఘర్షణ వైఖరి కంటే ఆయనతో స్నేహంగా ఉండటమే మంచిదనే ఆలోచలో బీజేపీ అధినాయకత్వం వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగా జగన్ కు కేంద్రం కీలక పదవిని ఆఫర్ చేసింది. జగన్ ను అంతర్ రాష్ట్రాల మండలి స్థాయీ సంఘం సభ్యునిగా నియమించింది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో నలుగురికి కేంద్రం ఈ స్థాయీ సంఘంలో సభ్యత్వాన్ని కల్పించింది. వారిలో ఇద్దరు తటస్థులు కావడం, ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీకి చెందిన నాయకుడు కావడం, మరొకరు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం గమనించ తగ్గ విషయం. మరిన్ని వివరాలు వీడియోలో చూడవచ్చు