జగన్ నా ఆస్తులు కాజేశాడు: మాజీ మంత్రి బాలినేని
మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ జగన్ పై కీలక విమర్శలు చేశారు. కాకినాడ జిల్లా చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. జగన్ నాకు చేసిన అన్యాయాన్ని చెప్పాలంటే సమయం సరిపోదన్నారు.
వైఎస్ ను అడ్డుపెట్టుకుని జగన్ సిఎం అయ్యాడని తెలిపారు. మంత్రి పదవి తీసేసినా తానేమీ బాధపడలేదని, నా ఆస్తులను కాజేశాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ భార్యలపై కామెంట్స్ చేసినప్పుడే వైసీపీని వీడాలనుకున్నా కుదరలేదని తెలిపారు. పవన్ స్వశక్తితో పైకి వచ్చారని, ప్రాణం పోయే వరకు ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు.