పవన్ కళ్యాణ్ బీజేపీ మైకం నుండి బయటకు రండి: వైఎస్ షర్మిల
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. చేగువేరా, గద్దర్ సిద్ధాంతాలకు పవన్ నీళ్లొదిలేశారని విమర్శించారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని, జనసేన పార్టీని 'ఆంధ్ర మతసేన'గా మార్చారని మండిపడ్డారు. మత పిచ్చి, BJP ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమని చెప్పారు. పవన్ ఇప్పటికైనా ఆ పార్టీ మైకం నుంచి బయటపడాలని ఎద్దేవా చేశారు.