రేషన్ బియ్యం కేసు, పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

Politics Published On : Friday, March 7, 2025 04:29 PM

ఏపీ హైకోర్టులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని)కి ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్న సంగతి తెలిసిందే. పేర్ని నాని(Perni Nani) సతీమణి పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్‌లో రేషన్‌ బియ్యం మాయమైందన్న అభియోగాలతో కూటమి ప్రభుత్వం కిందటి ఏడాది డిసెంబర్‌లో కేసు పెట్టింది. ఈ కేసులో జయసుధ పేరును ఏ1గా,  ఏ2గా గోదాం మేనేజర్‌ మానస్ తేజ్, మిల్లు యాజమాని బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ మంగారావులను మిగతా నిందితులుగా చేర్చారు. 

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజరు కాగా.. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే ఈ అభియోగాలను ఖండించిన పేర్ని నాని.. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసేనని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనను అరెస్ట్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌(Anticipatory Bail) కోసం ఆయన హైకోర్టు(High Court)ను ఆశ్రయించగా.. చివరకు ముందస్తు బెయిల్ (anticipatory bail to former minister Perni Nani) మంజూరు చేసింది.