బిగ్ బ్రేకింగ్: రాజధానిగా అమరావతి రద్దు.. 4 జోన్లుగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రద్దు కాబోతోంది! రాజధాని కేంద్రంగా జరగాల్సిన పరిపాలనను సంపూర్ణంగా వికేంద్రీకరించి. ప్రజలకు రాజధానితో సంబంధమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని డివిజన్ల తరహాలో నవ్యాంధ్రను కూడా నాలుగు జోన్లుగా విభజించాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి, ప్రతి జోన్లో ప్రతి కీలక శాఖకు చెందిన జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టినట్లు పేర్కొన్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 75 జిల్లాలు ఉన్నాయి. పాలనాసౌలభ్యం కోసం వీటన్నిటినీ 18 డివిజన్లుగా విభజించి. డివిజనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.
ఇదే మోడల్‌పై సీఎం జగన్ దృష్టి సారించారు. జోనల్ వ్యవస్థపై సోమవారం ఉదయం జరిగే మంత్రివర్గ భేటీలో, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తన కార్యాచరణను వెల్లడిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజధాని నగరంతో ప్రజలకు సంబంధమే లేకుండా చేయడమే సీఎం ఉద్దేశమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నాలుగు జోనల్ కమిషనరేట్లను ఏర్పాటు చేసి. ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించేస్తే రాజధానిపై వారిలో సెంటిమెంటు ఉండదని భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్నాయి.
ఏవి ఎక్కడ?
- అమరావతిలో అసెంబ్లీ (వర్షాకాల, శీతాకాల సమావేశాలు మాత్రమే), హైకోర్టు బెంచ్.
- విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.
- కర్నూలులో హైకోర్టు, న్యాయ పరిధిలోని సంస్థలన్నీ..