ఇలాంటి అద్భుతం మనకి మాత్రమే సొంతం..!
సింహం నోట్లో గుండ్రటి రాయి చూడటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, అయితే ఈ శిల్పం వివరాలు తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. అవి ఏమిటో చూదాం రండి. ఈ సింహం నోట్లో గుండ్రంగా ఉన్న రాయిని మీరు చేత్తో ఫ్రీగా తిప్పవచు, చాలా సులువుగా మృదువుగా శబ్దం లేకుండా తిరుగుతుంది.
కానీ ఇక్కడే ఆశ్చర్యపడి విషయం వుంది, సింహం నోరు గుండ్రటి రాయి కన్న పెద్దదిగా ఉంటుంది. కానీ ఆ గుండ్రటి రాయిని మాత్రం మనం ఎంత ప్రయత్నించినా బయటకు తీయలేము. ఈ రాయిని గుండ్రంగా సింహం శిల్పం నోట్లోనే చెక్కారని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి ఇంకా చాలా ఆశ్చర్యకర శిల్పాలని చూడాలంటే తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లా లోని కైలాసనాద గుడికి వెళ్లాల్సిందే.