ఆ రైలు ఎక్కితే మూడు పూటలా భోజనం ఫ్రీ..
భారతదేశంలో ఒకే ఒక రైలు రోజుకు మూడు పూటలా ఉచిత భోజనాన్ని అందిస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా ప్రతి రోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రి భోజనం కూడా ప్రయాణికులకు ఫ్రీగా ఇస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి పంజాబ్ లోని అమృత్ సర్ కు నడిచే సర్ఖండ్ ఎక్స్ ప్రెస్ (12715) ఫ్రీ భోజనం ఏర్పాటు చేస్తూ భారత రైల్వే వ్యవస్థలో ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఈ భోజన సేవను 1995లో ప్రారంభించారు.