ఆ దేశాల్లో అసలు ఆదాయపన్ను ఉండదు..!
అమెరికన్లకు ఆదాయ పన్నును రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేపింది. అయితే ఆదాయ పన్నులేని దేశాలు ఇంకా చాలానే ఉన్నాయి.
సౌదీ, UAE, ఖతర్, ఒమన్, బహ్రెయిన్, బ్రూనై, ఉత్తర కొరియా, కేమన్ ఐలాండ్స్, బెర్ముడా, బహామాస్ లలో ఆదాయ పన్ను లేదు. వాటితో పాటు ఆంగ్విలా, St కిట్స్ అండ్ నెవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ, వాటికన్, మొనాకో, వాలిస్ అండ్ ఫుటూనా, వనువాటు, నౌరు దేశాల్లోనూ ఆదాయ పన్ను లేదు.