రూ.60 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు
ఏపిలో రాష్ట్ర ప్రణాళికా శాఖలో ఖాళీగా ఉన్న 175 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనతో పాటు P4 (People First) కార్యక్రమాల సమన్వయం కోసం వారిని ఉపయోగించనున్నారు.