లవర్ తో శృంగారం.. కట్ చేస్తే ఆసుపత్రిలో..
స్వయం సంతృప్తి కోసం చాలా మంది చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. లైంగికంగా తమను తాము సంతృప్తి పరుచుకునేందుకు వివిధ రకాల వస్తువులను తమ శరీరంలోకి జొప్పించుకోవడం లాంటి వాటికి పాల్పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఇటీవల తైవాన్‌లో వెలుగులోకి వచ్చింది.
తైవాన్‌లోని కావోసియుంగ్‌కు చెందిన 24 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతడి పురీషనాళంలో 20 సెం.మీ లోతుగా ఒక వస్తువు చిక్కుకున్నట్టు డాక్టర్లు గుర్తించారు. బాధితుడిని స్థానిక E-Da హాస్పిటల్‌లోని డాక్టర్ చెన్ చిహ్‌యి చికిత్స అందించారు. ఆ రోజు ముందు రాత్రి అతడి తన భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొన్నట్టు స్థానిక మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ చెప్పారు. ఆ చర్య తర్వాత అతడికి అసాధారణమైన అనుభూతి కలిగింది. అతడికి ప్రైవేటు పార్టులో ఏదో చిక్కుకున్నట్టు అనిపించింది. దాంతో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు.
ప్రైవేటు పార్టులో ఇరుక్కున్న వస్తువును తొలగించేందుకు రాత్రంతా తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ విఫలయ్యాడు. మలద్వారం నుంచి పెద్దప్రేగు వరకు లోతుగా ఓ వైబ్రేటర్ ఇరుక్కుపోయిందని ఎక్స్‌రేలో గుర్తించారు. దీంతో అతడికి హుటాహుటిన ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో రెండు రోజుల తర్వాత అతడికి ఆపరేషన్ చేశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్స అనంతరం వైద్యులు అతడి శరీరంలో నుంచి వైబ్రేటర్‌ను బయటకు తీశారు. వైద్యులు ఫోర్సెప్స్‌ను ఉపయోగించి బయటకు తీసినప్పుడు కూడా ఆ వైబ్రేటర్ ఆన్‌లో ఉండటం గమనార్హం.