వైసీపీ నేతను కాలర్ పట్టి లాక్కెళ్ళిన పోలీసులు: వీడియో
కడప గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేశారు వైఎస్సార్సీపీ నేత జల్లా సుదర్శన్ రెడ్డి వర్గీయులు. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని కాలర్ పట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేశారు పోలీసులు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ గదికి సంబంధించిన తాళాలు ఇవ్వాలని అడగగా ఎంపీపీ లేనిదే తాళాలు ఇవ్వలేనని చెప్పడంతో మాకే తాళాలు ఇవ్వవా అంటూ ఒక్కసారిగా అనుచరులతో దాడి చేశారు.