ఎలాన్ మస్కే నా బిడ్డకు తండ్రి

News Published On : Saturday, February 15, 2025 03:00 PM

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి అని ఓ రచయిత్రి సంచలన కామెంట్స్ చేసారు. తాను, ఎలాన్ మస్క్ కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెర్ ఆరోపించారు. ఆ బిడ్డ మస్క్13వ సంతానమని ఆమె తెలిపారు.

తమ చిన్నారి గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను సురక్షితంగా పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అయితే దీనిపై ఎలాన్ మస్క్ ఇంకా స్పందించలేదు.