రామ జననం: క్రీ.పూ. 5114లో జనవరి 10న అర్ధరాత్రి 12.05 గంటలకు జన్మించాడు

News Published On : Sunday, November 10, 2019 11:23 AM

రామాయణం హిందువులకి పవిత్ర గ్రంధం, రామాయణం లో వున్నవి అన్ని నిజంగా జరిగాయని, రాముడు భరత భూమిపై(భారత దేశం) జన్మించాడని, అయోధ్య పురవీధుల్లో నడయాడాడని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చి ఆన్‌ వేదా్‌స(ఐ సర్వ్‌) పరిశోధకులు వెల్లడించారు.

రాముడు జన్మించినప్పుడు మన సౌర కుటుంబం లోని ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయి. రాముడు వనవాసానికి వెళ్లేటప్పటికి రాముడి వయసు 25 సంవత్సరాలు అంటూ రామాయణంలో వాల్మీకి రాశారు, ఆ వివరాల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చి ఆన్‌ వేదా్‌స(ఐ సర్వ్‌) పరిశోధకులు తమ పరిశోధనలను మొదలుపెట్టారు. ప్లానిటోరియం అనే సాఫ్ట్‌వేర్‌ సహాయంతో కచ్చితంగా కాల నిర్ధారణ చేసి.. క్రీ.పూ. 5114లో జనవరి 10న అర్ధరాత్రి 12.05 గంటలకు రాముడు జన్మించాడని నిర్ధరించారు.