ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ పై విరుచుకుపడింది. `ఆపరేషన్ సింధూర్' పేరుతో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే భారత్ పాకిస్తాన్ కు బలమైన సందేశం పంపింది ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆ ఫోటోను మనం గమనించవచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా దీనిలో ఉంది.