మూడో కాన్పులో ఆడబిడ్డ పుడితే రూ.50,000
మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50వేలు, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును బహుమానంగా ఇస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు.
ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు ఆయన చెప్పారు.